అక్షరటుడే, వెబ్‌డెస్క్: విదేశాల్లో విద్యనభ్యసించేందుకు భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఉన్నత చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్తున్న వారి సంఖ్య ప్రతియేటా పెరుగుతోంది. మధ్య తరగతి ప్రజల్లో ఆదాయం పెరగడం, విదేశాల్లో అధిక జీతాలందించే ఉపాధి అవకాశాలుండడంతో పదేళ్లలో వీరి సంఖ్య రెట్టింపు అయ్యింది. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాంగ్, ఐర్లాండ్, కెనడా తదితర దేశాల్లో విద్యనభ్యసించేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇలాంటి వారి కోసం హైదరాబాద్‌కు చెందిన ప్యుపిల్ అబ్రాడ్ కన్సల్టెన్సీ మంచి అవకాశాలను కల్పిస్తోంది. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 10వేల మందికిపైగా విదేశాలకు ఉన్నత చదువుల కోసం వెళ్లారు. ఈ కన్సల్టెన్సీ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాంగ్, ఐర్లాండ్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ తదితర దేశాలకు ఎడ్యుకేషన్ వీసాలు ఇప్పిస్తోంది. బ్యాచ్‌లర్స్ అండ్ మాస్టర్స్ కోర్సుల్లో అడ్మిషన్లు ఇప్పిస్తోంది. అడిష్మన్ దరఖాస్తు ప్రక్రియ నుంచి ఐ-20 వీసా ప్రక్రియ సాజావుగా పూర్తయ్యేలా అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందువల్లే కన్సల్టెన్సీ నుంచి ఏటా వందల మంది విద్యార్థులు వీసా పొందుతున్నారు.
రెండు దశాబ్దాలకు పైగా..
ప్యుపిల్ అబ్రాడ్ కన్సల్టెన్సీ హైదరాబాద్ కేంద్రంగా రెండు దశాబ్దాలకు పైగా విజయవంతంగా కొనసాగుతోంది. దీనికి హిమాయత్‌నగర్, దిల్‌షుఖ్ నగర్, కేపీహెచ్‌బీలలో బ్రాంచ్‌లు ఉన్నాయి. సంస్థ ఆధ్వర్యంలో జీఆర్‌ఈ, టోఫెల్, ఐఎల్స్, పీటీఈ తదితర ఇంగ్లిష్ నైపుణ్య కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. కన్సల్టెన్సీ పలు దేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీలతో కోలాబిరేషన్ కలిగి ఉంది. దీని వల్ల విద్యార్థులు వీసా పొందే అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి.
విదేశాల్లో ఈ కోర్సులకు డిమాండ్..
ఐటీ ప్రోగ్రామ్స్, ఇంజినీరింగ్, ఎంబీఏ రిలేటెడ్ కోర్సులకు ఎక్కువ డిమాండ్ ఉంది. వీటిని అభ్యసించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగ్గా లభిస్తున్నాయి. అందుకే విద్యార్థులు ఈ కోర్సులకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ప్రస్తుతం ఐటీ మేనేజర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డేటా అనాలసిస్, ఫినాన్షియల్ మేనేజర్, ఇండస్ట్రియల్ ఇంజినీర్ ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. విదేశాల్లో విద్యనభ్యసించాలానుకునే ఆసక్తి గల విద్యార్థులు 7900549005, 8985656888 నంబర్లను సంప్రదించాలని మేనేజింగ్ డైరెక్టర్ శ్రావణ్ గౌడ్ తెలిపారు.