Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఇండియా – న్యూజిలాండ్ మధ్య సాగిన ఉత్కంఠ పోరులో భారత్ గెలుపొందింది. భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో కివీస్ పై విజయం సాధించింది. రోహిత్ శర్మ 76, శ్రేయస్ అయ్యర్ 48, శుభ్ మన్ గిల్ 31 పరుగులతో రాణించారు. కాగా.. కివీస్ బౌలర్లు మిచెల్ సాంట్నర్, బ్రాస్ వెల్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇండియా జట్టు గెలుపుతో టీమిండియా అభిమానులు సంబరాల్లో మునిగితేలారు.
Advertisement