Mumbai attacks | ఉగ్రవాదులు తహవూర్ రాణా – హెడ్లీ సంభాషణలపై చర్చ

Mumbai attacks | ఉగ్రవాదులు తహవూర్ రాణా – హెడ్లీ సంభాషణలపై చర్చ
Mumbai attacks | ఉగ్రవాదులు తహవూర్ రాణా – హెడ్లీ సంభాషణలపై చర్చ

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Mumbai attacks | ముంబై దాడుల్లో వందలాది మృతి చెందడంపై తహవూర్ రాణా హర్షం వ్యక్తం చేశాడు. భారతీయులకు Indians తగిన శాస్తి జరిగిందని వ్యాఖ్యానించాడు. ముంబైలో Mumbai దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను terrorists కీలక సూత్రధారి అయిన తహవూర్ రాణా Tahawoor Rana ప్రశంసించాడు. దాడులకు పాల్పడి మరణించిన ఉగ్రవాదులకు పాక్ Pakistan అత్యున్నత శౌర్య పురస్కారం ‘నిషాన్ ఏ హైదర్’ ‘Nishan-e-Haider’ ఇవ్వాలని తహవూర్ రాణా వ్యాఖ్యానించాడని అమెరికా న్యాయ శాఖ US Department of Justice వెల్లడించింది. 26/11 దాడుల ఘటనకు కుట్రదారు అయిన రాణాను అమెరికా భారత్కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడ్ని అప్పగిస్తున్న ఫొటోను విడుదల చేసింది. అలాగే, రాణా, అతడి చిన్ననాటి మిత్రుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీతో Dawood Gilani జరిపిన సంభాషణలను వెల్లడించింది. ఈ ఇద్దరు కలిసి ముంబై దాడులకు Mumbai attacks కుట్రపన్నారని ఎన్ఐఏ అభియోగం మోపింది.

Advertisement

Mumbai attacks | టెర్రరిస్టులపై రాణా ప్రశంసలు..

అమెరికా జైలులో రాణా, హెడ్లీ సంభాషణల గురించి ఆ దేశ న్యాయశాఖ US Justice Department తాజాగా వెల్లడించింది. ఉగ్రదాడులకు పాల్పడి భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందిన తొమ్మిది మంది ఉగ్రవాదులను రాణా ప్రశంసించాడని తెలిపింది. అలాగే, చనిపోయిన వారికి పాకిస్తాన్ అత్యున్నత శౌర్య పురస్కారం ‘నిషాన్-ఎ-హైదర్’ ‘Nishan-e-Haider’ ఇవ్వాలని కోరినట్లు పేర్కొంది. యుద్ధంలో ధైర్యసాహసాలకు పాకిస్తాన్ ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘నిషాన్-ఎ-హైదర్’. ఇది మరణించిన సైనికులకు మాత్రమే ఇవ్వబడుతుంది. కానీ, ఆ పురస్కారాన్ని ఉగ్రవాదులకు ఇవ్వాలని రాణా కోరడం గమనార్హం. ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో terrorist attacks 166 మంది మరణించడంపై భారతీయులు అందుకు అర్హులు అని రాణా హెడ్లీకి చెప్పాడని అమెరికా న్యాయ శాఖ ప్రకటన పేర్కొంది.

Mumbai attacks | ముంబైలో మారణ హోమం

2008 నవంబర్లో లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న పది మంది ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబైలోకి ప్రవేశించారు. 26వ తేదీ నుంచి 29 వరకు మూడు రోజుల పాటు విధ్వంసం సృష్టించారు. 12 చోట్ల కాల్పులు, బాంబు దాడులకు bomb attacks పాల్పడ్డారు. వీరి దాడుల్లో ఆరుగురు అమెరికన్లు సహా 166 మంది మృతి చెందారు. మొత్తంగా ముంబై నగరం 1.5 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తి నష్టం సంభవించింది. ఎన్ఎస్జీ సహా ఇతర భద్రతా బలగాలు, ముంబై పోలీసులు కలిసి తొమ్మిది మంది ఉగ్రవాదులను మట్టుబట్టారు. అజ్మల్ కసబ్ ప్రాణాలతో చిక్కాడు. న్యాయ విచారణ అనంతరం అతడ్ని 2012లో పుణె జైలులో ఉరి తీశారు.

Advertisement