Stock markets | నష్టాల్లో సూచీలు

Stock markets | నష్టాల్లో సూచీలు
Stock markets | నష్టాల్లో సూచీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Stock markets) బుధవారం నష్టాలలో కొనసాగుతున్నాయి. చైనా(China) విషయంలో అమెరికా(America) దుందుడుకుగా వ్యవహరిస్తుండడం, చైనా సైతం ఎక్కడా తగ్గకపోవడంతో అంతర్జాతీయం(International)గా ఆర్థిక అనిశ్చిత పరిస్థితి నెలకొంది. దీని ప్రభావం మన మార్కెట్లపైనా కనిపిస్తోంది. బుధవారం ఉదయం 124 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌(Sensex). 75 పాయింట్ల నష్టంతో నిఫ్టీ(Nifty) ప్రారంభమయ్యాయి.

Advertisement
Advertisement

మార్కెట్‌(Market) తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. ఉదయం 13.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌(Sensex) 390 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ(Nifty) 130 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి.
బీఎస్‌ఈ(BSE)లో 1,075 స్టాక్స్‌ లాభాల బాటలో ఉండగా 2,503 కంపెనీలు నష్టాల బాటలో ఉన్నాయి. 181 స్టాక్స్‌ ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  stock market | గ్లోబల్‌ మార్కెట్‌లో కొనసాగుతున్న ర్యాలీ.. ప్రధాన ఎక్స్ఛేంజీలన్నీ గ్రీన్‌లోనే..

Stock Markets | వడ్డీ రేట్లను తగ్గించినా..

ఆర్‌బీఐ(RBI) వరుసగా రెండోసారి వడ్డీ రేట్లను సవరించింది. మార్కెట్‌(Market) అంచనా వేసినట్లుగానే రెపో రేట్‌ను 0.25 బేసిస్‌ పాయింట్లు(Basis points) తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ ఇన్వెస్టర్లు(Domestic investors) ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

Advertisement