అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) సూచించారు. సిరికొండ మండలం చిన్నవాల్గోట్(Chinna Walgot)లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు పూర్తి చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను(Indiramma houses) మంజూరు చేశామని చెప్పారు. ఇంకా అర్హులైన వారు ఉన్నట్లయితే వారిని గుర్తించి మంజూరు పత్రాలు అందజేయాలని సూచించారు. ఆయన వెంట నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్(Rajendra Kumar), స్థానిక అధికారులు ఉన్నారు.