అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indiramma Housing Scheme : రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పంది. త్వరలో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రకటించింది.
రాష్ట్రంలో ఇల్లు లేని పేదల కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించింది. అర్హులను ఎంపిక చేయడానికి ప్రజాపాలనలో దరఖాస్తులు కూడా స్వీకరించారు. అనంతరం ఇటీవల జరిగిన గ్రామసభల్లో లబ్ధిదారుల వివరాలు ప్రదర్శించారు.
Indiramma Housing Scheme : ఈ నెల 15లోగా..
నారాయణపేట జిల్లాలోని అప్పక్‌పల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో 72,045 ఇళ్లను మంజూరు చేసింది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ.ఐదు లక్షల చొప్పున ప్రభుత్వం సాయం చేయనుంది. మొదటి దశలో లబ్ధిదారులకు లక్ష రూపాయలు జమ చేయనున్నారు. మొదటి దశ డబ్బులను ఈ నెల 15లోగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రిలీజ్ చేస్తారు.
Indiramma Housing Scheme : దశల వారీగా..
ఇల్లు నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం దశల వారీగా రూ.ఐదు లక్షలు అందించనుంది. బేస్మెంట్ లెవల్ వరకు పనులు పూర్తి కాగానే రూ.లక్ష జమ చేయనుంది. అనంతరం గోడలు నిర్మించాక రూ.1.25 లక్షలు, స్లాబ్ పూర్తయ్యాక రూ.1.75 లక్షలు, మొత్తం ఇళ్లు పూర్తయ్యక మరో రూ.లక్ష ప్రభుత్వం జమ చేయనుంది. మొదటి దశలో 700 మంది లబ్ధిదారులు నిర్మాణాన్ని ప్రారంభించారు.