అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ : వస్తు, సేవల నాణ్యతా ప్రమాణాల వారోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్లను సోమవారం ఆర్మూర్‌లో తహశీల్దార్‌ హరీశ్‌ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇందూరు వినియోగదారులు సంక్షేమ సమితి అధ్యక్ష, కార్యదర్శులు పెందోట అనిల్‌ కుమార్‌, సందు ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడారు. వినియోగదారుడు కొనుగోలు చేసే వస్తువులు, సరుకులు, సేవలకు నాణ్యతా ప్రమాణాలు రక్షణగా నిలుస్తాయన్నారు. ఉత్సవాలు 16వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు.