అక్షరటుడే, ఇందూరు: SLBC | ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన మిగతా ఆరుగురి కోసం రెస్య్కూ టీం సభ్యులు అన్వేషిస్తున్నారు. కాగా.. ఈ ఆపరేషన్(RESCUE OPERATION)లో జిల్లా నుంచి ఫైర్‌స్టేషన్ లీడింగ్ ఫైర్‌ఫైటర్(LEADING FIRE FIGHTER) ఏసురత్నం పాల్గొంటున్నారు. ఎస్డీఆర్ఎఫ్(SDRF) నుంచి పిలుపు రావడంతో ఆయన ఎస్ఎల్బీసీకి చేరుకుని సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. టన్నెల్లో ఆరుగురు గల్లంతైన ప్రాంతంలో ఎస్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు మట్టిని, నీటిని తోడుతున్నారు. ఈ పనుల్లో ఫైర్‌ఫైటర్ ఏసురత్నం పాల్గొంటున్నారు. ఇటీవల టన్నెల్లో ఆరుగురు గల్లంతైన ప్రాంతాన్ని కేరళ నుంచి వచ్చిన కేడవర్ డాగ్స్ గుర్తించిన విషయమే. తాజాగా గల్లంతైన ప్రాంతాన్ని ఎస్డీఆర్ఎఫ్ బృందం అణువణువు క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.
SLBC | ఎస్ఎల్బీసీ రెస్క్యూ టీంలో ఇందూరు ఫైర్‌స్టేషన్ ఉద్యోగి
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement