కౌలాస్‌నాలా ప్రాజెక్టులోకి మొదలైన ఇన్‌ఫ్లో

0

అక్షరటుడే, జుక్కల్‌: నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జుక్కల్‌ మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో మొదలైంది. పసుపు వాగుపై నిర్మించిన ఈ జలాశయంలోకి 521 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 458 మీటర్లు(1.237 టీఎసీలు) కాగా గురువారం ఉదయానికి 454.70 మీటర్ల(0.580 టీఎంసీల) నీరు నిల్వ ఉంది.