అక్షరటుడే, జుక్కల్ : నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో స్వల్పంగా పెరిగింది. జలాశయంలోకి 860 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగుల(17.80 టీఎంసీలు)కు గాను మంగళవారం ఉదయం వరకు 1387.92 అడుగుల(3.26 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.