అక్షరటుడే, వెబ్డెస్క్: PHOTOGRAPHY | ఈనాడు దినపత్రిక ఫొటో జర్నలిస్ట్ ఇంగు శ్రీనివాస్ (Eenadu Photographer Engu Srinivas) ఉత్తమ ఫొటోగ్రఫీ అవార్డు(BEST PHOTOGRAPHY AWARD) అందుకున్నారు. సోమవారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్(GOVERNOR) చేతులమీదుగా అవార్డును స్వీకరించారు. తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ ఫొటోగ్రఫీ డేను గతేడాది ఆగస్ట్ 19న నిర్వహించారు. కాగా.. శ్రీనివాస్ తీసిన చిత్రం ఉత్తమ ఫొటో కేటగిరీలో ఎంపికైంది.
హైదరాబాలోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనకు అవార్డును అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, ప్రెస్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ ఇండియా దేవులపల్లి అమర్, ఐఅండ్ పీఆర్ కమిషనర్ హరీష్, టీయూడబ్ల్యూజే ప్రెసిడెంట్ విరాహత్ అలీ, కార్యదర్శి రామనారాయణ తదితరులు పాల్గొన్నారు.