అక్షరటుడే, వెబ్ డెస్క్: నగరంలోని జిమ్ యాజమాన్యాలకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు నగర సీఐ నరహరి జిమ్ ఓనర్లతో శుక్రవారం సమావేశమయ్యారు. నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే వ్యాయామం కోసం వచ్చే యువత ముఠాలుగా ఏర్పడవద్దన్నారు. పోలీసుల సూచనలు తప్పకుండా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. ఎస్సైలు రామ్, ప్రవీణ్ కుమార్, సంజీవ్ సిబ్బంది పాల్గొన్నారు.