అక్షరటుడే, వెబ్డెస్క్: Intermediate | తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు సంబంధించిన 2025–26 అకడమిక్ క్యాలెండర్ academic calendar విడుదలైంది. జూన్ 2నుంచి కళాశాలలు ప్రారంభం కానున్నాయి. కాగా.. మొత్తం 226 రోజుల పాటు కళాశాలల నడవనున్నాయి.
Intermediate | సెప్టెంబర్ 28 నుంచి దసరా హాలీడేస్
అంతేకాకుండా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయి. ఇక సంక్రాంతి హాలీడేస్ 2026 జనవర్ 11 నుంచి 18 వరకు ఉండనున్నాయి. జనవరి చివరి వారంలో ప్రీఫైనల్స్, ఫిబ్రవరి తొలివారంలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. మార్చి ఫస్ట్ వీక్లో పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. 2026 మార్చి 31వ తేదీ చివరి వర్కింగ్ డే నిర్ణయించారు.