అక్షరటుడే, వెబ్డెస్క్: Inter Exams : ఇంటర్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. వార్షిక పరీక్షల్లో ఒక్క నిమిషం నిబంధనను ఎత్తేసింది. దీంతో విద్యార్థులకు భారీ ఊరట కలిగింది. ఏటా ప్రభుత్వం ఇంటర్ పరీక్షల సమయంలో ఒక్క నిమిషం నిబంధన విధించేది. దీంతో వివిధ కారణాలతో కేంద్రానికి ఆలస్యంగా వచ్చే విద్యార్థులు పరీక్షకు రాయలేకపోయేవారు. దీంతో ఎంతోమంది విద్యార్థులు నష్టపోయారు. ఇకపై ఈ సమస్య ఉండబోదు.
Inter Exams : విద్యార్థుల హర్షం
ఇంటర్ పరీక్ష కేంద్రానికి ఒకటి, రెండు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. దీంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు పరీక్షలు ప్రారంభం కానుండగా రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అధికారులు అనుమతించనున్నారు.
Inter Exams : వారికి మేలు..
ఇంటర్ వార్షిక పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ కాలేజీలు మండల కేంద్రాలు, పట్టణాల్లో ఉన్నాయి. చాలా వరకు జిల్లా కేంద్రంతో పాటు పట్టణాల్లో ఉన్న సెంటర్లలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
అయితే మారుమూల గ్రామాల విద్యార్థులు కేంద్రాలకు సకాలంలో చేరుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. రవాణా సౌకర్యం లేక కేంద్రాలకు వచ్చే లోపు అధికారులు గేటుకు తాళం వేస్తున్నారు. ప్రస్తుతం ఒక నిమిషం నిబంధన ఎత్తివేయడంవో వారికి మేలు జరగనుంది.