నిజాయితీ చాటుకున్న విద్యార్థులు

0

అక్షరటుడే, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని ముగ్గురు యువకులు నిజాయితీని చాటుకున్నారు. ఆర్‌కే కాలేజీకి చెందిన ఇంటర్‌ చదువుతున్న సంపత్‌, ప్రవీణ్‌, వినయ్‌ కలిసి జీవదాన్‌ ఆస్పత్రి వైపు వెళ్తుండగా వారికి పర్సు దొరికింది. వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేసి చెప్పారు. విచారణ జరిపిన పోలీసులు పర్సు పోగొట్టుకున్న వ్యక్తి ఐలాపూర్‌కు చెందిన కార్తీక్‌గా గుర్తించారు. బాధితుడికి తిరిగి పర్సును అప్పగించారు. అనంతరం ముగ్గురు యువకులను పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి సన్మానించారు.