అక్షరటుడే, వెబ్ డెస్క్ : ఇంటర్ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా 90 రోజుల ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం సూచించారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి, రికార్డులను పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో సమావేశం నిర్వహించి 90 రోజుల ప్రణాళికపై పలు సూచనలు చేశారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ నిజాం, అధ్యాపకులు ఉన్నారు.