అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై ఆదేశ ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ అరెస్టు వారెంట్‌ను ఇచ్చింది. నవంబర్‌ 18లోగా ఆమెను అరెస్టు చేసి తమ ఎదుట హాజరు పరచాలని ఐసీటీ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ మహమ్మద్‌తజుల్‌ ఇస్లాం తన ఆదేశాల్లో పేర్కొన్నారు. రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌హసీనా తన పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఆతర్వాత నుంచి ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.