అక్షరటుడే, వెబ్డెస్క్: X Services | ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సోమవారం సాంకేతిక సమస్య తలెత్తింది. ‘ఎక్స్’ ఖాతాలను తెరవగానే ఖాళీ పేజీ దర్శనమిస్తోందంటూ పలువురు యూజర్లు ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా వాపోయారు. ఇలా.. భారత్లోనే దాదాపు 2 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు చెబుతున్నారు.
‘ఎక్స్’ సేవలు రావట్లేదంటూ యూకేలో 10 వేల మంది, అమెరికాలో 18 వేల మంది పోస్టులు చేసినట్లు తెలుస్తోంది. అమెరికాలో దాదాపు 57 శాతం మందికి ఈ సమస్య ఎదురైనట్లు అక్కడి పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. కాగా, దీనిపై కంపెనీ ఇంతవరకు స్పందించలేదు. సిబ్బంది కొరత, ఇతర సాంకేతిక కారణాల వల్ల తరచూ ఆ మధ్య ‘ఎక్స్’ సేవలు నిలిచిపోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎక్స్ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి.