Nizamabad | చోరీలు, చైన్​ స్నాచింగ్​ల​ కేసుల్లో అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌..

Nizamabad | అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌..
Nizamabad | అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌..
Advertisement

అక్షర టుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad | జిల్లాతో పాటు నిర్మల్​లోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్‌ చేసినట్లు ఏసీపీ ఎల్‌ రాజా వెంకట్‌రెడ్డి తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన షేక్‌ ఇమ్రాన్, నాందేడ్‌కు చెందిన అమన్, నిర్మల్‌ జిల్లా బాసరకు చెందిన షేక్‌ అర్బాజ్‌ ముగ్గురు కలిసి జిల్లాకేంద్రంలోని అరేబియన్‌ మండి, వినాయక్‌నగర్, బోర్గాం(పి), రాంచంద్రపల్లి, మాక్లూర్‌లో చైన్‌స్నాచింగ్‌తోపాటు నిర్మల్‌ జిల్లా భైంసా, తానూర్, బాసరలో బైక్‌ల దొంగతనం, ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇచ్చోడలో దోపిడీ నేరాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. నగరంలోని నాలుగోటౌన్‌లో నమోదైన కేసు మేరకు ఎస్సై శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయగా, సాంకేతిక ఆధారాలతో నేరస్తులను గుర్తించినట్లు చెప్పారు. ఈ మేరకు షేక్‌ ఇమ్రాన్, షేక్‌ అర్బాజ్‌లను అరెస్ట్‌ చేశామని, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి 50గ్రాముల విలువైన బంగారు గొలుసులు, ఒక పల్సర్‌ బైక్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Expressway | తెరపైకి మళ్లీ నాగ్‌పూర్-గోవా శక్తిపీఠ్ ఎక్స్‌ప్రెస్‌ రహదారి