అక్షర టుడే, వెబ్ డెస్క్ iPhone 15 : ఈ రోజుల్లో ఎవరి దగ్గర చూసిన ఐఫోన్ కనిపిస్తుంది. ఐఫోన్ (iPhone 15) లేకపోతే ఉండలేమనట్టుగా కొందరు ప్రవర్తిస్తున్నారు. లక్షల్లో ఐఫోన్ ధరలు ఉన్నా కూడాచాలా మంది వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు అయితే ఖరీదు ఎక్కువని వాటి జోలికి పోవడం లేదు. అయితే ఐఫోన్ (iphone)కొనుగోలు చేయాలని అనుకునేవారికి ఒక్కోసారి అమెజాన్ డిస్కౌంట్స్ (Amazon Discounts) ఇస్తుంటుంది. తాజాగా ఐఫోన్లు డిస్కౌంట్ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌చేంజ్ ఆఫర్లను పూర్తి స్థాయిలో వాడుకుంటే అతి భారీ తగ్గింపుకే ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు.
iPhone 15 : బెస్ట్ ఆప్షన్..
అమెజాన్‌లో ఐఫోన్ 15 (iPhone 15) 128GB వెర్షన్ ధరను రూ.79,900గా లిస్ట్ చేశారు. అమెజాన్ నుంచి ఈ ఐఫోన్ మోడల్‌పై నేరుగా 23 శాతం తగ్గింపు పొందవచ్చు. దీంతో కేవలం రూ. 61,400కే కొనుగోలు చేయవచ్చు. మీరు ఈఎంఐలో కొనుక్కోవాలని అనుకుంటే ప్రతి నెల రూ.2,764 చెల్లించాలి. ఐఫోన్ 15.. 128GB వెర్షన్‌కు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీనిపై, అమెజాన్ (Amazon Discounts) రూ.52,200 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. మీ పాత ఫోన్ పని చేస్తూ ఉంటే, మీరు పూర్తి ఎక్స్‌చేంజ్ విలువను పొందితే ఈ ఐఫోన్‌ను దాదాపు రూ.9,200కే కొనుగోలు చేయవచ్చు. అంటే 10 వేల రూపాయల కంటే తక్కువ ధరకే ఐఫోన్‌ను కొనొచ్చు. ఐఫోన్ 15 పాత మోడలే. గత ఏడాది ఆపిల్ ఐఫోన్ 16ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
అల్యూమినియం ఫ్రేమ్, సిరామిక్ షీల్డ్‌తో ఐఫోన్ 15 (iPhone 15) అందుబాటులో ఉంది. IP68 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఉంది. 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED స్క్రీన్ డిస్‌ప్లేతో ఇది అందుబాటులో ఉంది. డైనమిక్ ఐలాండ్ తో ఐఫోన్ 15ను (iPhone 15) తీసుకొచ్చారు. వీడియో నాణ్యత కోసం డాల్బీ విజన్‌కు సపోర్టుతో దీన్ని విడుదల చేశారు. A16 బయోనిక్ చిప్ (4nm టెక్నాలజీ) తో మార్కెట్లో అందుబాటులో ఉంది. సాఫ్ట్‌వేర్ iOS 18.2.1లో నడుస్తుంది. మరి ఎందుకు ఆలస్యం ఐఫోన్ కావాలనుకునే వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ అవకాశం వినియోగించుకోండి.