అక్షరటుడే, వెబ్‌డెస్క్: iPhone 17 | ఐఫోన్ (iPhone) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఐఫోన్ మాత్రమే కాదు.. యాపిల్ కంపెనీకి చెందిన ఏ ప్రోడక్ట్ అయినా సరే.. దానికి ఒక వాల్యూ ఉంటుంది. యాపిల్ వస్తువుల్లో అత్యంత పాపులర్ అంటే ఐఫోన్ అనే చెప్పుకోవాలి. అందుకే ప్రతి సంవత్సరం ఒక్కో సిరీస్‌ను రిలీజ్ చేస్తూ సరికొత్త ఫీచర్లను యాడ్ చేస్తూ యాపిల్.. ఐఫోన్ సిరీస్ (iPhone series)ను విడుదల చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఐఫోన్ 16 సిరీస్ మార్కెట్లో ఉంది. ఈ సంవత్సరం ఐఫోన్ 17ను రిలీజ్ చేసేందుకు యాపిల్ సన్నద్ధమవుతోంది.
ఇంకా ఐఫోన్ 17 (iPhone 17) సిరీస్ విడుదల కాలేదు. దాని ఫీచర్స్ ఏంటో తెలియదు కానీ.. ఆన్ లైన్ లో మాత్రం ఐఫోన్ 17 సిరీస్ కొత్త ఫీచర్లు ఇవే అంటూ తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో టెక్ నిపుణులు.. ఐఫోన్ 17(iPhone 17)లో ఫలానా ఫీచర్లు రాబోతున్నాయంటూ తమకు తెలిసిన ఫీచర్లను చెబుతున్నారు. ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియదు కానీ.. మరికొద్ది నెలల్లో విడుదల కానున్న ఐఫోన్ 17 (iPhone 17)లో మాత్రం ఈ ఫీచర్లు ఖచ్చితంగా ఉంటాయని చెబుతున్నారు.
iPhone 17 | అత్యంత సన్నని సిరీస్ ఇదే
ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఐఫోన్ సిరీస్‌లతో పోల్చితే ఇదే అత్యంత సన్నని మోడల్ అని చెబుతున్నారు. కేవలం 5.5 మిల్లీమీటర్ల మందంతో ఉంటుందట. అంటే చాలా తక్కువ బరువుతో ఈ ఫోన్ ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న ఐఫోన్లు 6.9 మిల్లీమీటర్ల మందంతో ఉన్నాయి. అలాగే.. ఐఫోన్ 17 ఎయిర్ మోడల్ 6.6 ఇంచ్ డిస్ప్లేతో రానుంది. 5జీ మోడెం, 120 హెచ్‌జెడ్ డిస్ ప్లే, సింగిల్ లెన్స్ 48 ఎంపీ బ్యాక్ కెమెరా, ఏ19 లాంటి ఫీచర్లతో ఐఫోన్ 17 వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఐఫోన్ 17 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ ను రిలీజ్ చేయనుంది.