IPL 2025 : ఐపీఎల్ అభిమానుల‌కి మ‌ళ్లీ నిరాశే.. 5 నిమిషాల‌కే టిక్కెట్లు అన్ని బ్లాక్ అయ్యాయేంటి..!

IPL 2025 : ఐపీఎల్ అభిమానుల‌కి మ‌ళ్లీ నిరాశే.. 5 నిమిషాల‌కే టిక్కెట్లు అన్ని బ్లాక్ అయ్యాయేంటి..!
IPL 2025 : ఐపీఎల్ అభిమానుల‌కి మ‌ళ్లీ నిరాశే.. 5 నిమిషాల‌కే టిక్కెట్లు అన్ని బ్లాక్ అయ్యాయేంటి..!
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌: IPL 2025 : ఛాంపియ‌న్స్ ట్రోఫీ హంగామా ఈ ఆదివారంతో ముగియ‌నుంది. ఇక మార్చి 22 నుండి ఐపీఎల్ హంగామా మొద‌లవుతుంది. ఈ సారి అయిన ఐపీఎల్ మ్యాచ్‌లు లైవ్‌లో చూడాల‌ని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. అయితే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) జట్టు టిక్కెట్ల విక్రయాలను ప్రారంభిస్తున్నట్టు ఈ రోజు ప్ర‌క‌టించారు. ఉప్పల్‌ స్టేడియంలో ఈనెల 23న సన్‌రైజర్స్‌-రాజస్థాన్‌, 27న సన్‌రైజర్స్‌-లఖ్‌నవూ జట్ల మధ్య జరిగే రెండు మ్యాచ్‌ల టిక్కెట్లను ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయించనున్నారు.

IPL 2025 : ఇలా చేస్తే ఎలా..

అయితే టికెట్ల విక్రయాలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే తక్కువ రేటు టికెట్ల విక్రయాలను బ్లాక్ చేసేస్తున్నారు. దీంతో సగటు క్రికెట్ అభిమాని తక్కువ రెట్ల గల టికెట్లను కొని మ్యాచ్ చూడాల‌న్న ఆశ‌లు అడియాశ‌లు అవుతున్నాయి. అధిక రేటు ఉన్న టికెట్లు మాత్రం ఆన్​లైన్​లో అందుబాటులోనే ఉన్నాయి. అయితే దాని దొర ఒక్కో టికెట్ రూ.5వేలకు పైబడి ఉండడంతో సామాన్యుడు అటువైపు క‌న్నెత్తి కూడా చూడ‌డం లేదు.. సాధార‌ణంగా సామాన్యుడు మ్యాచ్ చూడాలంటే టిక్కెట్ ధ‌ర మిడిల్ క్లాస్ వాడికి అందుబాటులో ఉండే ధర 750, 1550 రూపాయలు అలా ఉంటేనే చూస్తారు. కానీ ఈ టిక్కెట్ల‌ని అలా బ్లాక్ చేస్తే సామాన్యుడి ఆశ‌లు అడియాశలు అవుతున్నాయి.

కొంతమంది దిక్కు తోచని స్థితిలో అధిక రేట్లు ఉన్న టికెట్లను విక్రయిస్తున్నారు. అయితే టికెటింగ్ ప్లాట్​ ఫాం కావాలనే ఇలా త‌క్కువ రేటు ఉన్న టిక్కెట్స్‌ని బ్లాక్ చేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. దీనిపై బీసీసీఐ త‌గు నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మార్చి 23న జరిగే స‌న్ రైజ‌ర్స్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అభిమానుల ఆసక్తిని ఆసరాగా చేసుకున్న టికెటింగ్ ప్లాట్ఫామ్స్ తక్కువ ధర ఉన్న టికెట్లను నిమిషాల వ్య‌వ‌ధిలో బ్లాక్ చేయ‌డం ఏం బాగోలేదంటూ క్రికెట్ ప్రియులు మండిప‌డుతున్నారు.

Advertisement