HCA | ఐపీఎల్​ టికెట్ల వివాదం.. మొదలైన విజిలెన్స్ విచారణ

HCA | ఐపీఎల్​ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ
HCA | ఐపీఎల్​ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ

అక్షరటుడే, వెబ్​డెస్క్​: HCA | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య నెలకొన్న ఐపీఎల్​ టికెట్ల IPL ticket వివాదంలో విజిలెన్స్​ అధికారుల ఎంక్వైరీ మొదలైంది. విజిలెన్స్ చీఫ్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో మంగళవారం ఉప్పల్​ స్టేడియంలో విచారణ చేపట్టారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావుతో పాటు స్టేడియం సిబ్బందిని విచారించినట్లు సమాచారం.

Advertisement
Advertisement

HCA | ఒప్పందాలపై విచారణ

ఎస్​ఆర్​హెచ్​(SRH), హెచ్​సీఏ(HCA) మధ్య జరిగిన ఒప్పందాలకు సంబంధించిన పత్రాలను విజిలెన్స్​ అధికారులు పరిశీలించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ-మెయిల్స్ సైతం చెక్ చేసినట్లు తెలిసింది. ఐపీఎల్‌కు ముందు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలపై సైతం విచారించినట్లు సమాచారం.

ఇది కూడా చ‌ద‌వండి :  SRH Vs LSG : భారీ స్కోర్‌పై క‌న్నేసిన స‌న్‌రైజర్స్.. ల‌క్నో బ‌లి అయిన‌ట్టేనా?

HCA | సీఎం రేవంత్​ స్పందించడంతో..

టికెట్లు, పాస్ ల ​ కోసం తమను ఇబ్బంది పెడుతున్నారంటూ సీఎం రేవంత్​రెడ్డికి CM Revanth Reddy ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం SRH management లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ముఖ్యమంత్రి సీరియస్​ అయ్యారు. అంతేకాకుండా విచారణ చేపట్టి సమగ్ర నివేదిక సమర్పించాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు.

Advertisement