IPL | 11 గంటల నుంచి ఐపీఎల్​​ టికెట్ల విక్రయం

IPL | 11 గంటల నుంచి ఐపీఎల్​​ టికెట్ల విక్రయం
IPL | 11 గంటల నుంచి ఐపీఎల్​​ టికెట్ల విక్రయం
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : IPL | ఐపీఎల్​ కోసం క్రికెట్​ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. మ్యాచ్​ల కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎంతో మంది క్రికెట్​ ప్రేమికులు స్టేడియానికి వెళ్లి మ్యాచ్​ చూడాలని అనుకుంటున్నారు.

ఈ క్రమంలో హైదరాబాద్ వేదికగా జరిగే తొలి రెండు మ్యాచ్​లకు సంబంధించి శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆన్​లైన్​లో టికెట్ల విక్రయం ప్రారంభం కానుంది. రెండు టికెట్లు కొంటే ఒక జెర్సీని ఉచితంగా ఇస్తామని SRH ప్రకటించింది. 23న రాజస్థాన్, 27న లక్నోతో హైదరాబాద్​ టీం మ్యాచ్​లు ఆడనుంది. ఈ రెండు మ్యాచ్​లకు సంబంధించిన టికెట్ల విక్రయం 11గంటలకు మొదలు కానుంది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Champions Trophy | క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. మల్టీ ప్లెక్స్​లలో లైవ్​ టెలీకాస్ట్​