అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPS officer | ఐపీఎస్ అధికారి అభిలాష బిస్త్ IPS officer Abhilasha Bisht తెలంగాణ కేడర్ నుంచి రిలీవ్ అయ్యారు. ఆమె ఏపీ కేడర్‌లో రిపోర్ట్ చేశారు. ఐపీఎస్‌లు అంజనీకుమార్, అభిలాష బిస్త్ Abhilasha Bisht, అభిషేక్ మహంతిలను రిలీవ్ చేయాలని ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం central government ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే దీనిపై అభిలాష బిస్త్ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌లో Central Administrative Tribunal(CAT) సవాల్ చేశారు. కాగా క్యాట్‌లో ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేశారు. దీంతో ఆమె ఫిబ్రవరి 26న ఏపీలో రిపోర్ట్ చేసినట్టు జీవో విడుదల అయింది. రిపోర్టింగ్ తేదీ నుంచి 4 నెలలు చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. మరో ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి మాత్రం హైకోర్టు ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. క్యాట్‌లో విచారణ ముగిసే వరకు తెలంగాణలో పనిచేయాలని సూచించింది.