iQOO Z10 : 7300 ఎంఏహెచ్ బ్యాటరీతో ఐక్యూ జెడ్ 10 ఫోన్ లాంచ్.. ధరెంతో తెలుసా?

iQOO Z10 : 7300 ఎంఏహెచ్ బ్యాటరీతో ఐక్యూ జెడ్ 10 ఫోన్ లాంచ్.. ధరెంతో తెలుసా?
iQOO Z10 : 7300 ఎంఏహెచ్ బ్యాటరీతో ఐక్యూ జెడ్ 10 ఫోన్ లాంచ్.. ధరెంతో తెలుసా?

అక్షర టుడే, వెబ్ డెస్క్ iQOO Z10 : ఏ స్మార్ట్ ఫోన్ (Smart Phone) అయినా చార్జింగ్ పెట్టిన మూడు నాలుగు గంటల్లోనే బ్యాటరీ మొత్తం వీక్ అవుతూ ఉంటుంది. మన వాడకం అలా ఉంటుంది కదా. ఈరోజుల్లో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉండే ఫోన్ల వైపే మొబైల్ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. 5000, 6000 ఎంఏహెచ్ పవర్ ఉన్నా కూడా బ్యాటరీ బ్యాకప్ సరిపోవడం లేదు. ఒక్కసారి చార్జింగ్ పెడితే కనీసం ఐదారు గంటలు కూడా చార్జింగ్ రావడం లేదు. ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు అయితే చార్జింగ్ లేక చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఐక్యూ బ్రాండ్ నుంచి 7300 ఎంఏహెచ్ బ్యాటరీతో జెడ్ 10 మోడల్ ఫోన్ తాజాగా భారత్ లో లాంచ్ అయింది.

Advertisement

జెడ్ సిరీస్ లో భాగంగా రెండు కలర్స్ ఆప్షన్లలో ఈ ఫోన్ ను ఐక్యూ (iQOO Z10) లాంచ్ చేసింది. ఐక్యూ జెడ్ 10 ఫోన్ ఫీచర్లు కూడా అదుర్స్ అనేలా ఉన్నాయి. 8 జీబీ ప్లస్ 128 జీబీ మోడల్ ఫోన్ ధర రూ.21,999 కాగా, 8 జీబీ ప్లస్ 256 జీబీ, 12 జీబీ ప్లస్ 256 జీబీ వర్షన్ ఫోన్ల ధరలు రూ.23,999, రూ.25,999 గా ఉన్నాయి. ఐక్యూ జెడ్ 10 సిరీస్ లో భాగంగా జెడ్ 10 ఎక్స్ ఫోన్ ను కూడా విడుదల చేశారు. జెడ్ 10 ఎక్స్ మోడల్ లో 6 జీబీ ప్లస్ 128 జీబీ వర్షన్ ధర రూ.13,499 కాగా, 8 జీబీ ప్లస్ 128 జీబీ వర్షన్ ఫోన్ ధర రూ.14,999, 8 జీబీ ప్లస్ 256 జీబీ మోడల్ ధర రూ.16,499.

ఇది కూడా చ‌ద‌వండి :  Vivo | బిగ్గెస్ట్‌ బ్యాటరీతో మరో ఫోన్‌.. టీ సిరీస్‌లో లాంచ్‌ చేస్తున్న వీవో

iQOO Z10 : ఐక్యూ జెడ్ 10 స్పెసిఫికేషన్స్ ఇవే

డ్యూయల్ సిమ్, 5జీ, ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15, 6.77 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ (1080 * 2392 పిక్సెల్స్) ఏఎంవోఎల్ఈడీ డిస్ ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, 387 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 5000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 7 ఎస్ జెన్ 3 చిప్, 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, వైఫై డైరెక్ట్, బ్లూటూత్ 5.2, 7300 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్స్ చార్జింగ్ లాంటి ఫీచర్లతో జెడ్ 10 మోడల్ ఫోన్ విడుదల కాగా, జెడ్ 10 ఎక్స్ ఫోన్ కూడా దాదాపు ఇవే ఫీచర్లతో విడుదలైంది. కాకపోతే జెడ్ 10 ఎక్స్ ఫోన్ లో మాత్రం 6500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 44 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

Advertisement