అక్షరటుడే, నిజాంసాగర్‌: రబీ పంటల సాగు కోసం ఈ నెల 13 నుంచి నిజాంసాగర్‌ నీటిని విడుదల చేయనున్నట్లు నీటిపారుదల శాఖ ఏఈ శివకుమార్‌ తెలిపారు. ఏప్రిల్‌ రెండో వారం వరకు నీటి విడుదల కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు, 17.80 టీఎంసీలు కాగా.. అంతే మొత్తం నీటి నిల్వ ఉంది. కాగా.. మొత్తం ఆరు విడతల్లో 10.30 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. 15 రోజులపాటు నీటి విడుదల కొనసాగించి, 15 రోజులపాటు నిలిపివేస్తూ.. ఆన్‌ ఆఫ్‌ పద్ధతిలో ఆయకట్టు రైతుల అవసరాలకు అనుగుణంగా నీటిని ఇవ్వనున్నారు. దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు.