Nityananda Swamy | నిత్యానంద నిజంగా మరణించారా..? క్లారిటీ ఏంటంటే..

Nityananda Swamy | నిత్యానంద నిజంగా మరణించారా..? క్లారిటీ ఏంటంటే..
Nityananda Swamy | నిత్యానంద నిజంగా మరణించారా..? క్లారిటీ ఏంటంటే..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nityananda Swamy | భారత దేశంలో​ తీవ్రమైన లైంగిక ఆరోపణలు ఎదుర్కొని ఈక్వెడార్​కు పారిపోయిన నిత్యానంద స్వామి(Nithyananda Swami) మృతి చెందాడని సోషల్ మీడియా(Social Media)లో వార్తలు వస్తున్నాయి. తనకు తాను స్వయం ప్రకటిత దేవుడిగా ప్రకటించుకున్న నిత్యానందపై దేశంలో అనేక లైంగిక ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఆయన సుమారు 50 సార్లు కోర్టు(Court)లకు సైతం హాజరయ్యారు. అప్పట్లో ఆయన వార్తల్లో నిలిచారు.

Advertisement
Advertisement

Nityananda Swamy | 2019లో దేశం విడిచి పారిపోయి..

లైంగిక ఆరోపణలపై కేసు నమోదై తాను జైలు(Jail)కు వెళ్లక తప్పదని నిర్ణయించుకున్న నిత్యానంద 2019 నవంబర్​లో భారత్​(India)ను వదిలి ఈక్వెడార్​కు పారిపోయారు. ఈక్వెడార్​లోని ఓ ద్వీపంలో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. అక్కడ ‘కైలాస’ అనే ప్రత్యేక దేశాన్నే ఆయన తయారు చేశారని వినికిడి. కైలాస దేశానికి ప్రత్యేకంగా డాలర్(Dollar)ను కరెన్సీగా ప్రకటించారు. రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ కైలాస(Reserve Bank of Kailasa)ను కూడా ప్రారంభించినట్లు తెలిపారు.

Nityananda Swamy | ఇప్పటికీ సమాచారం లేదు..

ఇలా ప్రత్యేక దేశం(Country).. కరెన్సీ(Currency) సృష్టించుకున్న ఆయన కరెక్ట్​గా ఎక్కండుంటున్నారనే సమాచారం ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈక్వెడార్​లోని ద్వీపం(Island in Ecuador)లో ఉన్నట్లు అక్కడి పోలీసులు చెబుతున్నప్పటికీ.. అధికారికంగా ఈక్వెడార్​ మాత్రం దీనిని ధృవీకరించట్లేదు.

ఇది కూడా చ‌ద‌వండి :  Ghibli Style AI Images | సోషల్​ మీడియాలో సందడి చేస్తున్న గిబ్లి స్టైల్ చిత్రాలు

Nityananda Swamy | అంతా సోషల్​మీడియాలోనే..

నిత్యానంద(Nithyananda) ఎక్కడున్నారనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ ఫేస్​బుక్ (Facebook) తదితర సామాజిక మాద్యమాల్లో మాత్రం పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి. కాని  ‘కైలాస'(‘Kailaasa’) ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయన బతికున్నారా? లేదా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది..

Nityananda Swamy | తాను బతికే ఉన్నానని…

తాను చనిపోయినట్లు వార్తలు వస్తుండడంతో ఆయన స్పందించినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆయనకు చెందిన ఫేస్​బుక్​ ఖాతా(Facebook account)లో ఆయన చిత్రాలు, ఆయన పేపర్(Paper)​పై ఏదో రాస్తున్నట్లుగా ఉన్న ఫొటోలు షేర్​ అయ్యాయి. అయినప్పటికీ నిత్యానంద ఏమయ్యారు అనే విషయమై ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

Advertisement