Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వీరమల్లు మళ్లీ వాయిదానా.. పాపం నిర్మాతల పరిస్థితి ఏంటో..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వీరమల్లు మళ్లీ వాయిదానా.. పాపం నిర్మాతల పరిస్థితి ఏంటో..?
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వీరమల్లు మళ్లీ వాయిదానా.. పాపం నిర్మాతల పరిస్థితి ఏంటో..?
Advertisement

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్​లో మొదలు పెట్టిన క్రేజీ మూవీ హరి హర వీరమల్లు. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా పీరియాడికల్ సబ్జెక్ట్​తో వస్తుంది. సినిమా మొదలు పెట్టి నాలుగేళ్లు అవుతున్నా ఇంకా పూర్తి కాలేదు. సినిమాకు ఎలాగు భారీగా ఖర్చు అయ్యిందని నిర్మాతలు ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ లేట్ అవుతుందని డైరెక్టర్ క్రిష్ ఏడాది క్రితమే ఈ సినిమాను వదిలేసి బయటకు వెళ్లాడు.

ఐతే అప్పటి నుంచి వీరమల్లు సినిమా దర్శకత్వ బాధ్యతలను జ్యోతి కృష్ణ తీసుకున్నాడు. పవన్ ఇస్తున్న డేట్స్ ని అడ్జెస్ట్ చేసుకుంటూ షూటింగ్ చేస్తూ వచ్చారు. ఐతే హరి హర వీరమల్లు సినిమాను మార్చి 28న రిలీజ్ లాక్ చేశారు. అంటే మరో 20 రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఇప్పటికే మార్చి ఎండింగ్ లో రిలీజ్ అవుతున్న సినిమాలకు ప్రమోషన్స్ మొదలు పెట్టారు. వీరమల్లు పార్ట్‌–1 రిలీజ్​కు రెడీనా కాదా అన్నది ఇప్పటికీ డౌట్ గానే ఉంది.

Pawan Kalyan : షూటింగ్ కూడా కొంత ఉందన్నట్టు టాక్..

హరి హర వీరమల్లు మొదటి భాగానికి పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. అంతేకాదు ఇంకా షూటింగ్ కూడా కొంత ఉందన్నట్టు టాక్. చూస్తేనేమో సినిమా రిలీజ్​కి ఇంకా 20 రోజులు మాత్రమే ఉంది. ఈలోగా ఇవన్నీ జరుగుతాయా లేదా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ కి టెన్షన్ పట్టుకుంది. మార్చి 28 రిలీజ్ అని మేకర్స్ చెబుతున్నా కూడా ఎక్కడో వాళ్లకి కూడా డౌట్ గానే ఉందని తెలుస్తుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Pawan Kalyan : వామ్మో.. ఇదెక్క‌డి అరాచ‌కం .. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫొటో చూపించే కోట్లు కాజేసిన కేటుగాళ్లు

వీరమల్లు పార్ట్–1 ఈ నెల చివరన రిలీజ్ అవ్వాలి అంటే పవన్ కళ్యాణ్ కాస్త టైం ఇవ్వాల్సి ఉంటుంది. మరి పవర్ స్టార్ ఆ సినిమాకు టైం ఇస్తారా లేదా అన్నది చూడాలి. సో ఆ సినిమా మార్చి 28న రిలీజ్ కష్టమని తెలుస్తుంది కాబట్టే మ్యాడ్ స్క్వేర్ ని ఆ డేట్ కి వేస్తున్నట్టు ఉన్నారని చెప్పుకుంటున్నారు. మరి పవన్ సినిమాల విషయంలో ఇలా టైం పాస్ అవ్వడం ఫ్యాన్స్ కి కూడా నచ్చట్లేదు. అంతేకాదు ఈ సినిమా మీద నాలుగేళ్లుగా టైం మనీ పెట్టి ఉన్న నిర్మాతల పరిస్థితి ఏంటో అని చర్చించుకుంటున్నారు.

Advertisement