అక్షరటుడే, వెబ్‌డెస్క్ : బంగ్లాదేశ్‌లోని హిందువుల హక్కులను రక్షించడానికి నిరంతరం కృషి చేస్తామని ఆదేశ ఇస్కాన్ తెలిపింది. హిందువులను వారి ప్రార్థనా స్థలాలను రక్షించాలని శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన చిన్మయ్ కృష్ణదాస్‌కు ఇస్కాన్ మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని పేర్కొంది. మాది శాంతి, ప్రేమగల భక్తి ఉద్యమం. ఇస్కాన్‌కు చెందిన ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ ను వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరుతున్నామని పేర్కొన్నారు. ‘బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్‌ను లక్ష్యంగా చేసుకొని కొందరు కల్పిత, హానికరమైన ప్రచారాలు చేస్తున్నారని, సమాజంలో మా సంస్థను అప్రతిష్ఠపాల్జేయడానికి అశాంతిని సృష్టించడానికి చేస్తున్నట్లు ఉంది’ అని ఇస్కాన్ సంస్థ ప్రధాన కార్యదర్శి చారు చంద్రదాస్ వ్యాఖ్యనించారు.