అక్షరటుడే, వెబ్‌డెస్క్: టోల్ గేట్ల వద్ద ఫీజు వసూళ్లపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయిలోకి ప్రవేశించే ఐదు టోల్‌ప్లాజాల వద్ద లైట్ మోటార్ వాహనాలకు ఇకపై టోల్ ఫీజు వసూలు చేయబోమని ప్రకటించింది. దహిసర్, ములుంద్, వాషి, ఐరోలి, తిన్హంత్ నాకా టోల్‌ప్లాజాల వద్ద కార్లు, ఎస్‌యూవీలకు మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. సోమవారం అర్థరాత్రి నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి.