అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులో, కుంటలు ప్రాజెక్టులకు వరద భారీగా వస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఎస్సారెస్పీ, నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులకు భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది. పలు చోట్ల వాగులు ఉదృతంగా పారుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇందల్వాయి నుంచి ధర్పల్లి వెళ్లే మార్గంలో పాటి తాండా వద్ద బ్రిడ్జి మూసివేశారు. లింగంపేట మండలం మోతే పాటిగడ్డ తండాకు రాకపోకలు నిలిచిపోయాయి.