అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ మూవీకి సెన్సార్‌ పరంగా ఇబ్బందులు ఉన్న విషయం తెలిసిందే. ఈమూవీకి సర్టిఫికెట్‌ ఇవ్వాలంటే కొన్ని మార్పులు చేయాలని బోర్డు ఇటీవల తెలిపింది. సెన్సార్‌ బోర్డు సూచించిన కొన్ని షరతులకు అంగీకరిస్తున్నామని నిర్మాణ సంస్థ తరపు న్యాయవాది తెలిపారు. ఈసినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ విషయంలో ఓ నిర్ణయానికి రావాలని బాంబే హైకోర్టు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ నిర్మాణ సంస్థలను ఆదేశించింది. దీంతో కొన్నిరోజుల సమయం కోరిన నిర్మాణ సంస్థ తాజాగా మార్పులు చేస్తామని తెలిపింది. తదుపరి విచారణ అక్టోబర్‌ 3కు వాయిదా పడింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఎమర్జెన్సీ మూవీని నిర్మించారు. సినిమాలో తమ వర్గం గురించి తప్పుగా చిత్రీకరించారంటూ శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ సెన్సార్‌ బోర్డుకు లేఖ రాసింది. కంగనా నటించడంతో పాటు.. ఈచిత్రానికి నిర్మాతగాను వ్యవహరించారు. సెప్టెంబర్‌ 6న విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్‌ సర్టిఫికెట్‌ రాని కారణంగా వాయిదా పడింది.

Advertisement
Advertisement