అక్షరటుడే, వెబ్‌డెస్క్: మార్కెట్లలో ఐపీవోలు వరదలా వస్తూనే ఉన్నాయి. ఈ నెలలో ఇప్పటికే ఆరు మెయిన్ బోర్డు ఐపీవోలు వచ్చిన విషయం తెలిసిందే. ఈవారంలో మరో ఎనిమిది ఐపీవోల సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కాబోతోంది. ట్రాన్స్‌రైల్ లైటింగ్, సనాతన్ టెక్స్‌టైల్స్, డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్, మమత మిషనరీ, కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ కంపెనీల సబ్‌స్క్రిప్షన్ గురువారం ప్రారంభం కాగా.. వెంటివ్ హాస్పిటాలిటీ, సీనోర్స్ ఫార్మాసూటికల్స్, కర్రారో ఇండియా కంపెనీల సబ్‌స్క్రిప్షన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 23 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది.

సనాతన్ టెక్స్ టైల్స్(sanathan textiles)
దేశీయ మార్కెట్లనుంచి రూ.550 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో సనాతన్ టెక్స్ టైల్స్ ఐపీవోకు వస్తోంది. ఈ కంపెనీ ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ.305 నుంచి రూ.321గా ఉంది. లాట్‌లో 46 షేర్లుంటాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం రూ.14,766 తో సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీకి జీఎంపీ 12శాతం ఉంది.

కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ (concord enviro systems limited)
కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ రూ.500.33 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైస్‌బ్యాండ్‌ను రూ. 665 నుంచి రూ.701గా నిర్ణయించారు. ఒక లాట్‌లో 21 షేర్లుంటాయి. కనీసం ఒక లాట్ కోసం రూ.14,721 తో బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీ జిఎంపీ 10శాతంగా ఉంది.

మమత మిషైనరీ (Mamata Machinery)
మార్కెట్లనుంచి రూ. 179.39 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో మమత మిషైనరీ లిమిటెడ్ ఐపీవోకు వస్తోంది. కంపెనీ ధరల శ్రేణిని రూ. 230-243 గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 61 షేర్లుంటాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం రూ.14,823 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీకి గ్రే మార్కెట్ ప్రీమియం 82 శాతంగా ఉంది.

డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్ (DAM Capital Advisors)
డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్ సంస్థ రూ.840.25కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. ఈ కంపెనీ ప్రైస్‌బాండ్‌ను రూ. 269-రూ.283 గా ఫిక్స్ చేసింది. ఒక లాట్‌లో 53 షేర్లుంటాయి. ఆసక్తిగలవారు 53 షేర్ల కోసం రూ. 14,999తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కంపెనీకి గ్రేమార్కెట్ ప్రీమియం 52 శాతంగా ఉంది.

ట్రాన్స్‌రైల్ లైటింగ్ (Transrail Lighting)
ట్రాన్స్‌రైల్ లైటింగ్ కంపెనీ మార్కెట్‌నుంచి రూ. 838.91 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. ధరల శ్రేణిని రూ. 410 నుంచి రూ. 432గా ఉంది. ఒక లాట్‌లో 34 షేర్లుంటాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 34 షేర్లకోసం రూ. 14,688తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జీఎంపీ 35 శాతం ఉంది.