అక్షరటుడే, ఇందూరు: holidays : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సెలవు రోజుల్లోనూ సిబ్బందితో అధికారులు పని చేయించుకోవడం సరికాదని మానవ హక్కుల కార్యకర్త(Human rights activist), న్యాయవాది డాక్టర్ పులి జైపాల్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ (Congress SC cell) మాజీ అధ్యక్షుడు ఘగన్ పేర్కొన్నారు. శనివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కార్మికులకు ప్రతినెలా రెండో శనివారం, ఆదివారం, మన దేశ మహానీయుల జయంతులకు సెలవులు ఇస్తారని.. కానీ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఇది సరైన పద్ధతి కాదని, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కార్మిక చట్టాలను, కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. ప్రెస్ మీట్ లో భారాస ఎస్సీ సెల్ అధ్యక్షుడు నీలగిరి రాజు మాదిగ, జేఏసీ నాయకులు మల్లాని శివ తదితరులు పాల్గొన్నారు.