అక్షరటుడే, వెబ్ డెస్క్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో శుక్రవారం ఉదయం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు.. హైదరాబాద్ లో ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఇందులో ఓ బృందం పొంగులేటి నివాసంలోనూ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ రైడ్స్ కు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా గతేడాది నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి పై ఐటీ సోదాలు జరగగా.. తాజాగా ఈడీ తనిఖీలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది.