Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: హైదరాబాద్‌లో ‘మీ టికెట్‌’ యాప్‌ను ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌ బాబు గురువారం ప్రారంభించారు. టీజీఈఎస్‌డీ ‘మీ టికెట్‌’ అనే అప్లికేషన్‌ను రూపొందించింది. ఆర్టీసీ, మెట్రో, ఆలయాలు, పర్యాటక ప్రాంతాల టికెట్ల సౌకర్యాన్ని ఈ యాప్‌ ద్వారా పొందొచ్చు. సులభమైన మరిన్ని యాప్‌లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి శ్రీధర్‌ బాబు చెప్పారు.

Advertisement