IT stocks | ఐటీ.. పిటీ.. టెక్‌ స్టాక్స్‌పై టారిఫ్‌ బండ

IT stocks | ఐటీ.. పిటీ.. టెక్‌ స్టాక్స్‌పై టారిఫ్‌ బండ
IT stocks | ఐటీ.. పిటీ.. టెక్‌ స్టాక్స్‌పై టారిఫ్‌ బండ

అక్షరటుడే, వెబ్​డెస్క్​: IT stocks | అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ US President Trump రెండోసారి ఎన్నికయ్యాక ఐటీ స్టాక్స్‌(IT Stocks)కు గ్రహణం పట్టినట్లయ్యింది. అన్ని దేశాలపైనా ట్రేడ్‌ వార్‌(Trade war) చేస్తున్న ఆయన టారిఫ్‌ల విషయంలో రోజుకో మాట మాట్లాడుతూ రావడంతో డిసెంబర్‌ నుంచి టెక్‌ స్టాక్స్‌ నేల చూపులు చూస్తున్నాయి. ఏప్రిల్‌ 2న టారిఫ్‌ల ప్రకటనల అనంతరం ఈ కంపెనీల పరిస్థితి మరింత దిగజారింది. మన ఐటీ కంపెనీలు ఎక్కువగా అమెరికా(America) పై ఆధారపడి వ్యాపారం చేస్తుంటాయి. దీంతో టారిఫ్‌(Tariff)ల ప్రభావం వీటిపై కనిపిస్తోంది. జనవరి ఒకటో తేదీన 44,798 పాయింట్ల వద్దనున్న నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌.. గురువారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 34,757 పాయింట్లకు పడిపోయింది. అంటే మూడు నెలల్లోనే ఐటీ ఇండెక్స్‌ 10,041 పాయింట్లు నష్టపోయిందన్న మాట. ట్రంప్‌ అనుసరిస్తున్న విధానాలతో యూఎస్‌లో ఆర్థికమాంద్యం రావచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు(Investors) లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఐటీ కంపెనీలన్నీ పతనమవుతూనే ఉన్నాయి. శుక్రవారం సైతం ఐటీ ఇండెక్స్ నష్టాల్లోనే కొనసాగుతోంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో 800 పాయింట్లకు పైగా నష్టపోయింది.

Advertisement
Advertisement

జనవరి ఒకటో తేదీనుంచి గురువారం వరకు మన ఐటీ కంపెనీల పతనం వివరాలు..

కంపెనీ జనవరి 1న సీఎంపీ ఏప్రిల్‌ 3న సీఎంపీ

  1. టీసీఎస్‌                4,322  3,403
  2. ఇన్ఫోసిస్‌             1,982  1,496
  3. విప్రో                        324    256
  4. హెచ్‌సీఎల్‌ టెక్‌    2,012  1,470
  5. టెక్‌ మహీంద్రా      1,736  1,369
  6. కోఫోర్జ్‌                  9,778  7,157
  7. పర్సిస్టెంట్‌           6,527  4,793
  8. ఎల్‌టీఐఎం          6,157  4,341
  9. ఎంఫసిస్‌             3,078  2,374
  10. ఓఎఫ్‌ఎస్‌ఎస్‌      12,879  7,581
ఇది కూడా చ‌ద‌వండి :  Stock markets | నష్టాల్లో సూచీలు

(సీఎంపీ(కరెంట్‌ మార్కెట్‌ ప్రైస్‌) రూపాయలలో..)

Advertisement