అక్షరటుడే, బాన్సువాడ: పంట చేతికి వచ్చాక కురుస్తున్న వర్షాలతో అన్నదాతకు నష్టం వాటిల్లుతోంది. బాన్సువాడలో మంగళవారం మధ్యాహ్నం అరగంట పాటు వర్షం కురిసింది. దీంతో మార్కెట్ కమిటీకి తీసుకొచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తడిసిపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.