IT Raids | క్రేన్‌ వక్కపొడి సంస్థల్లో ఐటీ సోదాలు.. భారీగా బంగారం స్వాధీనం

IT Raids | క్రేన్‌ వక్కపొడి సంస్థల్లో ఐటీ సోదాలు.. భారీగా బంగారం స్వాధీనం
IT Raids | క్రేన్‌ వక్కపొడి సంస్థల్లో ఐటీ సోదాలు.. భారీగా బంగారం స్వాధీనం
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : IT Raids | టెన్షన్​ ఎందుకు దండగా.. క్రేన్​ వక్క పలుకులుండగా అనే డైలాగ్​ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్​. ఇప్పుడు ఆ క్రేన్ వక్కపొడి సంస్థ ఓ వివాదంలో చిక్కుకుంది.

బుధవారం క్రేన్​(Crane) వక్కపొడి సంస్థపై ఐడీ దాడులు జరగడం కలకలం రేపింది. ఏపీ(AP), తెలంగాణ (Telangana) రాష్ట్రాల్లోని క్రేన్‌ వక్కపొడి సంస్థల్లో  ఐటీ(IT) అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌లో తనిఖీలు చేపట్టి 40 కేజీల బంగారం(Gold), 100 కేజీల వెండి ఆభరణాలు, పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Summer | పెరుగుతున్న ఉష్ణోగ్రతలు