అక్షరటుడే, హైదరాబాద్: Sri Chaitanya : శ్రీచైతన్య విద్యా సంస్థల్లో (Sri Chaitanya Schools, Junior Colleges) రెండో రోజు ఐటీ సోదాలు (IT searches) కొనసాగుతున్నాయి. మాదాపూర్‌లోని హెడ్ ఆఫీస్‌తోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 10 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో అధికారులు రూ.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Sri Chaitanya : పెద్ద మొత్తంలో అక్రమాలు!
అడ్మిషన్లు, ట్యూషన్ ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించిన అధికారులు.. శ్రీచైతన్య విద్యా సంస్థల్లో ఐటీ దాడులు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న ఈ విద్యా సంస్థల్లో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
Sri Chaitanya :ఫీజుల రూపంలో భారీగా వసూళ్లు
ఐఐటీ జేఈఈ, నీట్ వంటి స్థాయి పరీక్షల కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ విద్యా సంస్థల్లో జాయిన్ చేస్తూ ఉంటారు. ఇదే అదునుగా యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Sri Chaitanya : గతంలోనూ దాడులు..
శ్రీచైతన్య సంస్థలకు సంబంధించిన లావాదేవీల సాఫ్ట్ వేర్‌ను ఐటీ అధికారులు పరిశీలించారు. 2020లోనూ శ్రీచైతన్య సంస్థలో ఐటీ సోదాలు జరిగాయి. అప్పటి సోదాల్లో రూ.11 కోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Sri Chaitanya : పన్ను చెల్లింపులపై ఆరా..
రెండో రోజు కొనసాగుతన్న సోదాల్లో శ్రీచైతన్య విద్యా సంస్థల పన్ను చెల్లింపులపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.