అక్షరటుడే, వెబ్డెస్క్: IT search | దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కాలేజీల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో ఆరు రాష్ట్రాల్లో తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశం చర్చకు దారితీసింది.
ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, గుంటూరులలో సోదాలు జరుగుతున్నాయి. ఈ తనిఖీల్లో పెద్దమొత్తంలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. విద్యార్థుల నుంచి పెద్దఎత్తున ఫీజులు వసూలు చేస్తున్న ఈ విద్యా సంస్థ.. ఆదాయ పన్ను చెల్లింపులో అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో పక్కా సమాచారం మేరకు ఐటీ అధికారుల రైడ్స్ జరుగుతున్నాయి.
ఈ ఘటన నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్ విద్యా సంస్థలు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఐటీ అధికారుల జాబితాలో మరిన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నట్లు తెలిసింది.