అక్షరటుడే, వెబ్ డెస్క్: ఇండియాలోనే అతిపెద్దదైన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీగా పేరొందిన ‘స్టార్ హెల్త్’ కంపెనీకి సంబంధించిన కస్టమర్ల డేటా చోరీకి గురైనట్లు తెలుస్తోంది. టెలిగ్రామ్ యాప్‌లో కస్టమర్ల డేటాను బహిరంగంగా విక్రయించేందుకు ఉంచినట్లు సమాచారం. కస్టమర్ల వ్యక్తిగత సమాచారం, మెడికల్ రిపోర్టులు బహిరంగం అవుతున్నాయన్న సమాచారంపై కస్టమర్లలో ఆందోళన నెలకొంది. దీనిపై ఇన్సూరెన్స్ సంస్థ స్పందిస్తూ అనధికార డేటా యాక్సెస్‌పై స్థానిక అధికారులకు సమాచారమిచ్చామని, డేటా సురక్షితంగా ఉంటుందని ఎలాంటి ఆందోళన వద్దని పేర్కొంది.