అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు లేనట్లేనని తెలుస్తోంది. ఏ కేటగిరిలోనూ ఛార్జీల పెంపు లేదని ఈఆర్సీ (విద్యుత్ నియంత్రణ మండలి) ప్రకటించింది. డిస్కంల ప్రతిపాదనలను ఈఆర్సీ తిరస్కరించింది. 8 పిటిషన్లపై తన అభిప్రాయాలు వెల్లడించింది. 800 యూనిట్లు దాటితేనే ఫిక్స్‌డ్ ఛార్జీల పెంపు ఉంటుందని పేర్కొంది. ఫిక్స్‌డ్ ఛార్జీలు 10 నుంచి 50 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. గృహ వినియోగదారులకు మినిమం ఛార్జీలను ఈఆర్సీ తొలగించింది.