అక్షరటుడే, ఇందూరు:Congress Nizamabad | అంబేడ్కర్‌ను అవమానించింది బీజేపీనేనని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి(DCC President Manala Mohan Reddy) అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పూలాంగ్లో అంబేడ్కర్ విగ్రహానికి పాలతో శుద్ధి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు(BJP Leaders) అంబేడ్కర్ విగ్రహాన్ని తాకినందుకు నిరసనగా పాలతో శుద్ధి చేశామన్నారు. దేశంలో పీఎం(PM) నుంచి గ్రామస్థాయి బీజేపీ కార్యకర్త వరకు అంబేడ్కర్‌ను అవమానించారన్నారు. పార్లమెంటులో అమిత్‌షా(Amit Shah) అంబేడ్కర్ గురించి అభ్యంతరక వ్యాఖ్యలు చేస్తే ప్రధాని మోదీ(Prime Minister Modi) మందలించలేదని ఆరోపించారు. దీంతో బీజేపీ(BJP) చిత్తశుద్ధి ఎలాంటిదో అర్థమవుతుందని అన్నారు.
అనంతరం రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్(Chairman Taher bin) మాట్లాడుతూ.. ప్రజలను బీజేపీ మోసం చేయాలని చూస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అంబేడ్కర్ జయంతి(Ambedkar Jayanti) చేసుకుంటే.. పీఎం పార్లమెంటు(PM Parliamement)లో శ్రద్ధాంజలి ఘటించలేదన్నారు. కార్యక్రమంలో నూడా ఛైర్మన్ కేశవేణు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగం, ఓబీసీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, విజయపాల్ రెడ్డి, వినోద్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.