అక్షరటుడే, ఇందూరు: జిల్లాలోని చారిత్రక కట్టడాలు మ్యూజియంను పరిరక్షించాలని ఇతిహాస సంకలన సమితి జిల్లా అధ్యక్షుడు నరేష్ కుమార్ అన్నారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అనేక చారిత్రక కట్టడాలు శిథిలమైపోతున్నాయని, తిలక్ గార్డెన్లోని మ్యూజియానికి ఏడేళ్లుగా తాళం వేయడం విచారకరమన్నారు. తొందర్లోనే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, చరిత్ర అధ్యాపకులతో జాతీయస్థాయి సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా సలహాదారు ప్రొఫెసర్ ఆంజనేయులు, కార్యాధ్యక్షుడు మోహన్ దాస్, ఉపాధ్యక్షురాలు శైలి బెల్లాల్, ప్రధాన కార్యదర్శి ఆనంద్, ప్రొఫెసర్ భూపతి, మల్లయ్య, రాధా, నవీన్, తదితరులు పాల్గొన్నారు.