అక్షరటుడే,బోధన్: BODHAN | పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ల హవా నడుస్తోంది. కార్యాలయంలో నిత్యం ధరఖాస్తుదారులే కాకుండా రైటర్లు హంగామా సృష్టిస్తున్నారు. ఒక్కో ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం రేటు ఫిక్స్ చేసి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. వారిని దాటి నేరుగా ఆఫీస్‌కు వెళ్తే.. ఏ పని చేయకుండా అధికారులు కొర్రీ పెడుతున్నారు.
BODHAN | సిండికేట్‌గా మారి..
బోధన్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సంబంధించి దస్తావేజు లేఖరులు సిండికేట్‌గా మారారు. ఒక్కో డాక్యుమెంట్‌కు రేట్ ఫిక్స్ చేసి అక్రమంగా దరఖాస్తుదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇంటి రిజిస్ట్రేషన్ కోసం రూ.5,000 తీసుకుంటున్నారు. ప్రస్తుతం రియల్ ఏస్టేట్ వ్యాపారం ఆశించిన స్థాయిలో లేదు. జరిగే ఆ కొద్దిపాటి డాక్యుమెంట్ల అడ్డగోలుగా దోచుకుంటున్నారు. వీరితో అధికారులు కుమ్మక్కై ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. తాజాగా నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కినా.. ఇక్కడి అధికారుల వసూళ్లు మాత్రం ఆగట్లేదు.