Betting App | బెట్టింగ్​ యాప్​ ప్రమోటర్లకు ఇక కష్టమే.. రాష్ట్రవ్యాప్తంగా కేసులు

Betting App | బెట్టింగ్​ యాప్​ ప్రమోటర్లకు ఇక కష్టమే.. రాష్ట్రవ్యాప్తంగా కేసులు
Betting App | బెట్టింగ్​ యాప్​ ప్రమోటర్లకు ఇక కష్టమే.. రాష్ట్రవ్యాప్తంగా కేసులు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Betting App | బెట్టింగ్​ యాప్​ ప్రమోటర్లపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్​ యాప్​లతో రాష్ట్రంలో ఎంతోమంది జీవితాలు రోడ్డున పడ్డాయి. దీంతో డబ్బు కోసం యాప్​ను ప్రమోట్​ చేసిన వారు తప్పించుకోకుండా పక్కాగా కేసులు నమోదు చేయాలని పోలీసులను(Telangana Police) ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో బెట్టింగ్​యాప్​ ప్రమోటర్లపై(Betting App Promoters) చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్నాయి.

Betting App | ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే

బెట్టింగ్​ యాప్​లతో ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారని వారి కుటుంబాలకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (Mynampally Hanumantarao) కోరారు. ఆయన శనివారం నేరెడ్‌మెట్‌ పోలీస్​ స్టేషన్(Police Station)​లో ఫిర్యాదు చేశారు. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రోత్సహిస్తున్న వారిపై ఓయూ పీఎస్‌లో జనసేన (Janasena) విద్యార్థి విభాగం నాయకులు ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Bird Flu | మరోసారి బర్డ్​ ఫ్లూ కలకలం.. భారీగా కోళ్ల మృత్యువాత

Betting App | మిగతా ప్రాంతాల్లో..

బెట్టింగ్​ యాప్​లతో అప్పుల పాలై ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు వారి వివరాలు కూడా సేకరించారు. బెట్టింగ్​ యాప్​ ప్రమోటర్లు ప్రోత్సహించడంతోనే వారు ఆ ఊబిలో చిక్కుకున్నారని చెబుతున్నారు. కుమారుడు ఆన్​లైన్​ బెట్టింగ్​లకు అలవాటు పడి అప్పుల పాలు కావడంతో నిజామాబాద్​  (Nizamabad)జిల్లాలో నవంబర్​ 4న తల్లిదండ్రులు, కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఆ కేసులో సైతం తాజాగా బెట్టింగ్​ యాప్​ ప్రమోటర్లను చేర్చారు.

దీనిని బట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో నిందితులు తప్పించుకోకుండా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ఇందులో సినీ ప్రముఖులు ఉండటంతో కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Advertisement