అక్షరటుడే, కామారెడ్డి: వికారాబాద్ జిల్లాలో కలెక్టర్, అధికారులపై దాడిని ఖండిస్తున్నట్లు ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రైతుల పేరిట కొందరు ఉద్యోగులపై దాడికి పాల్పడడం విచారకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.