Assembly | స్పీకర్​పై జగదీశ్​రెడ్డి వ్యాఖ్యలు.. కాంగ్రెస్​ ఫైర్​

Assembly | స్పీకర్​పై జగదీశ్​రెడ్డి వ్యాఖ్యలు.. కాంగ్రెస్​ ఫైర్​
Assembly | స్పీకర్​పై జగదీశ్​రెడ్డి వ్యాఖ్యలు.. కాంగ్రెస్​ ఫైర్​
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: Assembly | మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి వ్యాఖ్యలతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఈ సభ మీ సొంతం కాదంటూ స్పీకర్​పై ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్​ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌కి జగదీష్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ సభ్యుల నిరసన తెలిపారు. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో స్పీకర్​ సభను వాయిదా వేశారు. అనంతరం సభ మళ్లీ ప్రారంభమైంది.

ఇది కూడా చ‌ద‌వండి :  KCR | అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ !

Assembly | బీఆర్‌ఎస్‌కు అహంకారం తగ్గలేదు

స్పీకర్​పై జగదీశ్​రెడ్డి వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు. బీఆర్​ఎస్​ ఇంకా అహంకారం తగ్గలేదన్నారు. దళిత స్పీకర్‌పై ఆ పార్టీకి గౌరవం లేదన్నారు. స్పీకర్‌ను ఏకవచనంతో సంబోదించడం సరికాదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు గతంలో మహిళా గవర్నర్‌, రాష్ట్రపతిని కూడా గౌరవించకుండా మాట్లాడారని గుర్తు చేశారు.

Advertisement